నితిన్‌ పెళ్లి వాయిదా..!

15 Mar, 2020 11:16 IST|Sakshi

‘భీష్మ’  విజయంతో మంచి ఊపుమీద ఉన్నాడు యంగ్‌ హీరో నితిన్‌. అంతేకాకుండా తాను ప్రేమించిన యువతిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నందుకు మరోరకంగా ఆనందంగా ఉన్నాడు. అయితే నితిన్‌ ఆనందంపై కరోనా కన్నెర్ర జేసినట్లు తెలుస్తోంది.  చాలాకాలంగా ప్రేమలో ఉన్న షాలినితో నితిన్ వివాహం వాయిదా పడిందనే వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.  ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అన్నిదేశాలలో విస్తరిస్తుడటం.. ఆయా దేశాలు విదేశీయుల్ని తమ దేశానికి రాకుండా నిషేధం విధించడంతో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకోవాలని భావిస్తున్నారని సమాచారం.
(చదవండి : ఘనంగా హీరో నితిన్‌ ఎంగేజ్‌మెంట్‌)

ముందుఅనుకున్న ప్రకారం ఏప్రిల్‌ 16న దుబాయ్‌లో నితిన్‌, షాలినీల వివాహం జరగాల్సిందింది. పెళ్లి పనులు కూడా స్టార్ట్‌ చేశారు.  కొద్ది మంది బంధువులు, మిత్రుల మధ్య దుబాయ్‌లో ఏప్రిల్ 15వ తేదీన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే ఏప్రిల్ 16వ తేదిన రిసెప్షన్ నిర్వహించాలని అనుకొన్నారు.  అయితే దుబాయ్‌లో కూడా కరోనావైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో పెళ్లి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లోనే నితిన్‌ వివాహం జరిపేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. కానీ దీనిపై నితిన్‌ , షాలినీ కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రకటన చేయదలేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు