రంగ్‌దే: అను, అర్జున్‌ల పరిచయం అదిరింది

29 Mar, 2020 16:59 IST|Sakshi

యంగ్‌ హీరో నితిన్‌, ‘మహానటి’ కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రంగ్‌ దే!’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. విజయదశమి పర్వదినాన ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంది. అయితే కరోనా లాక్‌డౌన్‌తో సినిమా షెడ్యూల్‌ వాయిదా పడింది. అయితే రేపు(మార్చి 30) హీరో నితిన్‌ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు చిత్ర బృందం చిన్న ట్రీట్‌ ఇచ్చింది. 

నితిన్‌ బర్త్‌డే కానుకగా ‘రంగ్‌ దే’ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా సినిమాలోని ప్రధాన పాత్రలైన అను, అర్జున్‌లను పరిచయం చేస్తూ ముస్తాబుచేసిన మోషన్‌ పోస్టర్‌ సినీ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా దేవిశ్రీప్రసాద్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఓ రేంజ్‌లో ఉంది. దీంతో ప్రస్తుతం ‘రంగ్‌ దే’మోషన్‌ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య,గాయత్రి రఘురామ్,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, మాస్టర్ రోనిత్  తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

చదవండి:
కరోనా ఎఫెక్ట్‌: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నితిన్‌ 
తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం

మరిన్ని వార్తలు