ఘనంగా హీరో నితిన్‌ ఎంగేజ్‌మెంట్‌

15 Feb, 2020 14:02 IST|Sakshi

 ఎట్టకేలకు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ యంగ్ హీరో నిశ్చితార్థం శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప‌రిమిత సంఖ్యలో స‌న్నిహితులు, మిత్రులు, కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఈ వేడుక‌ని నిర్వహించారు. ప్రీ వెడ్డింగ్ ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన నితిన్ త‌న పెళ్లి ప‌నులు స్టార్ట్ అయ్యాయ‌ని చెప్పాడు. షాలిని అనే అమ్మాయిని నితిన్‌ గత నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని నితిన్‌ ఇంట్లో చెప్పేయడంతో వారూ ఒప్పుకున్నారు. ఎప్రిల్‌ 16 నితిన్‌ వివాహం జరుగనుందని సమాచారం. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య దుబాయ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోబోతున్నారని తెలిసింది.ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ సినిమాతో బాగా బిజీగా ఉన్నారు. వెంకీ కుడుముల సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన కథానాయికగా నటించారు.  ఈ నెల 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్‌ దే సినిమాలో నటిస్తున్నాడు‌. ఈ సినిమా తరువాత విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి, దర్శకుడిగా మారిన లిరిసిస్ట్‌ కృష్ణ చైతన్యల దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు అంగీకరించాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు