నితిన్‌.. కీర్తి.. రంగ్‌ దే

25 Jun, 2019 02:16 IST|Sakshi

దాదాపు ఏడాది పాటు కెమెరాకు దూరంగా ఉన్నారు నితిన్‌. ‘శ్రీనివాస కల్యాణం’ తర్వాత స్క్రీన్‌పై కనిపించలేదు. ఇప్పుడు వరుస సినిమాలు అనౌన్స్‌ చేసి తీసుకున్న విరామాన్ని వడ్డీతో సహా తీర్చేస్తున్నారు. ఆల్రెడీ ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుములతో ‘భీష్మ’ సినిమా మొదలుపెట్టారు. మొన్నే చంద్రశేఖర్‌ యేలేటి సినిమాకు ముహూర్తం పెట్టారు. తాజాగా వెంకీ అట్లూరితో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు.

ఈ చిత్రానికి ‘రంగ్‌ దే!’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. కీర్తీ సురేశ్‌ కథానాయిక. నితిన్, కీర్తీ కలసి యాక్ట్‌ చేయడం ఇది తొలిసారి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మించనున్నారు. ఈ సినిమాకు పీసీ శ్రీరామ్‌ కెమెరామేన్‌. 2020 సమ్మర్‌లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. మరోవైపు కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా కూడా కమిట్‌ అయిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు