పిచ్చెక్కిస్తున్న ‘భీష్మ’ పోస్టర్స్‌

27 Oct, 2019 10:53 IST|Sakshi

అభిమానులకు హీరో నితిన్‌ సడన్‌ సర్‌ప్రైజ్‌ చేశాడు. నితిన్‌ హీరోగా ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశచెందుతున్నారు. అయితే దీపావళి కానుకగా అభిమానులకు నితిన్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. ‘భీష్మ’కు సంబంధించిన పోస్టర్లను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. మాస్‌, క్లాస్‌, లవ్‌‌, రొమాన్స్‌ షేడ్స్‌ కనిపించేలా విడుదల చేసిన పోస్టర్లు నెటిజన్లను తీవ్రంగా ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్‌ రష్మిక మరోసారి కుర్రకారును పిచ్చెక్కించడం ఖాయమని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అఆ తర్వాత భీష్మతో నితిన్‌ సూపర్‌ హిట్‌ అందుకోవడం ఖాయమని మరికొంత మంది కామెంట్‌ చేస్తున్నారు. ఇక ఇందులో రష్మిక మందన కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉంది. 

‘అఆ’ తర్వాత ఈ యంగ్‌ హీరో నితిన్‌కు సరైన విజయాలు లేవు.  'లై', 'ఛల్ మోహన రంగ', 'శ్రీనివాస కళ్యాణం' వంటి వైవిధ్య కథాంశాలతో నితిన్‌ తీసిన సినిమాలు కమర్షియల్‌గా హిట్‌ సాధించలేకపోయాయి. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చాడు. చిన్న విరామం తర్వాత నితిన్‌ వరుసగా సినిమాలతో దూకుడు పెంచాడు. ‘భీష్మ’ షూటింగ్‌ జరుగుతుండగానే 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' సినిమా షూటింగ్‌ విజయదశమి రోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో కీర్తి సురేష్‌ నితిన్‌ సరసన ఆడిపాడనుంది.ఇక కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాల దర్శకుడిగా మంచి పేరున్న చంద్రశేఖర్ ఏలేటితో కూడా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు నితిన్‌. భవ్య క్రియేషన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా వారియర్‌ కథానాయిక. అంతేకాకుండా తమిళంలో ధనుష్ నటించిన 'వాడ చెన్నై' సినిమాని పవర్ పేట పేరిట మరో సినిమాని చేయనున్నట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఖైదీకి సీక్వెల్‌ ఉంది 

అలాగైతే ఏమీ చేయలేం : రకుల్‌

విజయ్‌కి షాక్‌.. ఆన్‌లైన్‌లో బిగిల్‌

పండగ తెచ్చారు

బిగ్‌బాస్‌ : టికెట్‌ టు ఫినాలేకి మరొకరు

‘హీరో హీరోయిన్‌’ ఫస్ట్‌ లుక్‌ ఇదే..

‘అందుకే శ్రీముఖికి సపోర్ట్‌ చేయడం లేదు’

దీపావళి సందడి.. షేక్‌ చేస్తున్న తెలుగు హీరోల లుక్స్‌

బిగ్‌బాస్‌ 3 గ్రాండ్ ఫినాలే!?

బిగ్‌బాస్‌: అర్థరాత్రి ‘బిగ్‌’ షాక్‌

3 సినిమాల ఫస్ట్‌ డే కలెక్షన్లు ఎంత?

‘సూపర్‌ మచ్చి’ అంటున్న చిరు అల్లుడు 

‘సరిలేరు నీకెవ్వరు’.. విజయశాంతి ఫస్ట్‌ లుక్‌ ఇదే

బాలీవుడ్‌ చిత్రాల కంటే బాహుబలి, కేజీఎఫ్‌..

దర్శక నిర్మాతలకు షాక్‌ ఇచ్చిన రష్మిక!

లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన జీవీ సోదరి

దట్టించిన మందుగుండు

చిన్న గ్యాప్‌ తర్వాత...

ఉంగరాల టీనా

ద్రౌపదిగా దీపిక

85 ఏళ్ల కాజల్‌!

ఆర్టికల్‌ 370 కథ

ఒకటికి మూడు

ప్రేమకథలంటే ఇష్టం

లవ్‌ థ్రిల్లర్‌

జగదాంబ థియేటర్‌లో సందడి చేసిన హీరో

‘ఖైదీ’ మూవీ రివ్యూ

విజిల్‌ మూవీ రివ్యూ

దుర్గమ్మను దర్శించుకున్న నమ్రత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పిచ్చెక్కిస్తున్న ‘భీష్మ’ పోస్టర్స్‌

ఖైదీకి సీక్వెల్‌ ఉంది 

అలాగైతే ఏమీ చేయలేం : రకుల్‌

విజయ్‌కి షాక్‌.. ఆన్‌లైన్‌లో బిగిల్‌

పండగ తెచ్చారు

బిగ్‌బాస్‌ : టికెట్‌ టు ఫినాలేకి మరొకరు