అభిమన్యుడికి మరో హీరో ప్రశంసలు

20 Jun, 2018 15:53 IST|Sakshi

మాస్ హీరో విశాల్ హీరోగా సమంత, యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా అభిమాన్యుడు. పి.ఎస్. మిత్రన్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సైబర్ నేరాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్‌ మూవీ విశాల్ కెరీర్ లో నే బిగ్గెస్ట్ సూపర్ హిట్ గా నిలిచింది.

18 రోజుల్లో 18 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తుండటం కూడా అభిమన్యుడికి కలిసోస్తుంది. ఇటీవల మహేష్ బాబు అభిమన్యుడు యూనిట్‌ ను ప్రశంసించిన సంగతి తెలిసిందే. తాజాగా యంగ్ హీరో నితిన్ అభిమన్యుడు యూనిట్‌ను అభినందించారు.

‘అభిమన్యుడు సినిమా చూసాను. నాకు చాలా బాగా నచ్చింది. విశాల్, అర్జున్ సార్, సమంత ల నటన, దర్శకుడు పి.ఎస్. మిత్రన్ అద్భుతమైన స్క్రిప్ట్ తో పాటూ ఉత్కంఠ రేపే స్క్రీన్‌ప్లే తో సినిమా ఆసక్తికరంగా ఉంది. నిర్మాత హరి కి, చిత్ర బృందానికి అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు నితిన్‌. వెంటనే స్పందించిన విశాల్  ‘ థాంక్స్ బ్రదర్. నీకు సినిమా నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది’ అంటూ రిప్లై ఇచ్చారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు