ఆ ఫీలింగ్‌ కలగలేదు!

18 Jan, 2019 01:01 IST|Sakshi
నిత్యామీనన్‌

ఇప్పటివరకు సౌత్‌లో సత్తా చాటి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు కథానాయిక నిత్యామీనన్‌. ఈ ఏడాది ఆమె నార్త్‌ వైపు(బాలీవుడ్‌) కూడా దృష్టిసారించారు. ఇస్రో (ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) మార్స్‌ మిషన్‌ ఆధారంగా తెరకెక్కుతోన్న హిందీ చిత్రం ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాలో నిత్యామీనన్‌ శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. అక్షయ్‌ కుమార్, విద్యాబాలన్, సోనాక్షీ సిన్హా, తాప్సీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

హిందీలో ఆమె ‘బ్రీత్‌ 2’ అనే వెబ్‌ సిరీస్‌లో అభిషేక్‌ బచ్చన్‌కు జోడీగా నటిస్తున్నట్లు వెల్లడించారు.  ఇన్ని రోజులు సౌత్‌ ఇండస్ట్రీలో వర్క్‌ చేసిన మీరు ఇప్పుడు నార్త్‌ ఇండస్ట్రీలో ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటున్నారు అన్న ప్రశ్నను నిత్యామీనన్‌ను అడిగినప్పుడు–‘‘హిందీ పరిశ్రమలో నేను ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను కానీ ఇక్కడి వారికి నేను తెలుసు. నా సినిమాలు కొన్ని హిందీలో డబ్‌ అయ్యాయి. న్యూ కమర్‌ని అని, అవుట్‌సైడర్‌ని అన్న ఫీలింగ్‌ కలగలేదు నాకు.

తక్కువ కాలంలోనే స్నేహితులుగా కలిసిపోయాం. ఇప్పుడు నేను హిందీలో చేస్తున్న రెండు ప్రాజెక్ట్స్‌కు కెమెరామెన్స్‌ తమిళులే. వారితో నేను తమిళంలోనే మాట్లాడుతున్నాను. అక్కడ కంఫర్ట్‌గానే ఉంది. ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాలో నా షూటింగ్‌ పూర్తికావొచ్చింది. బ్రీత్‌ వెబ్‌సిరీస్‌ ‘బ్రీత్‌ 2’లో నటిస్తున్నా. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ ‘ఐరన్‌లేడీ’ సినిమాలో లీడ్‌ రోల్‌ చేయడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా