దృశ్యం డైరెక్టర్తో నిత్యామీనన్

24 Aug, 2016 11:34 IST|Sakshi
దృశ్యం డైరెక్టర్తో నిత్యామీనన్
వెంకటేష్ హీరోగా తెరకెక్కిన మలయాళ రీమేక్ సినిమా దృశ్యంతో డైరెక్టర్గా పరిచయం అయ్యింది సీనియర్ నటి శ్రీ ప్రియ. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె, తన రెండో ప్రయత్నంగా కూడా ఓ థ్రిల్లర్ సినిమానే ఎంచుకుంది. రీమేక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీ ప్రియ ప్రస్తుతం ఓ స్ట్రయిట్ సినిమాను రూపొందిస్తోంది. ఈ సినిమాలో లేడి ఓరియంటెడ్ సినిమాల కేరాఫ్ అడ్రస్ నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.
 
ఘటన పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. లవ్ కం రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా తన మార్క్ థ్రిల్లర్ గా రూపొందిస్తోంది శ్రీ ప్రియ. సన్ మూన్ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఘటనను సెప్టెంబర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. నిత్యా మీనన్తో పాటు క్రిష్, నరేష్, కోట శ్రీనివాసరావు, కోవై సరళలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి