ధనుష్‌తో నిత్యామీనన్‌ రొమాన్స్‌..!

9 Feb, 2020 08:30 IST|Sakshi

చెన్నై : నటుడు ధనుష్‌తో ఫస్ట్‌టైమ్‌ రొమాన్స్‌ చేయడానికి నటి నిత్యామీనన్‌ రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. ధనుష్‌ సక్సెస్‌ బాటలోపడ్డారు. చిత్రాల వేగాన్ని పెంచారు. ఈ మధ్య నటించిన  అసురన్‌ చిత్రం ధనుష్‌లో నూతనోత్సాహాన్ని పెంచిందని చెప్పవచ్చు. ఈ తరువాత నటించిన పటాస్‌ సక్సెస్‌ అయ్యింది. కార్తీక్‌సుబ్బరాజ్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేశారు. దీనికి సురుళి అనే పేరును నిర్ణయించినట్లు సమాచారం. కాగా ధనుఫ్‌ ప్రస్తుతం మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో కలైపులి ఎస్‌.థాను అవుతున్నారు. అవును షమితాబ్‌ చిత్రం తరువాత హిందీలో మరో చిత్రాన్ని చేయనున్నారు. ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వం వహించనున్న ఆట్రాంగి రే. అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇకపోతే ఆయన  నటించనున్న 43వ చిత్రం గురించి ఇటీవల వార్త వెలువడింది.

ఇంతకు ముందు పటాస్‌ చిత్రాన్ని నిర్మించిన సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ దీన్ని నిర్మించనుంది. దీనికి యువ దర్శకుడు కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వం వహించనున్నారు. కాగా ధనుష్‌ నటించనున్న 44వ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుంది. దీని గురించి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రంలో సంచలన నటి నిత్యామీనన్‌ నాయకిగా నటించనుందన్నది తాజా సమాచారం. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు నచ్చితే అది ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధం అంటుంది. అది రెండు మూడు సన్నివేశాల్లో కనిపించే పాత్ర అయినా సరే. నచ్చకపోతే అది మణిరత్నం చిత్రం అయినా నో చెప్పేస్తుంది. కాగా ఈమె మిష్కిన్‌ దర్శకత్వంలో ఉదయనిధిస్టాలిన్‌తో కలిసి నటించిన సైకో చిత్రం ఇటీవలే విడుదలైంది. కాగా జయలలిత బయోపిక్‌తో తెరకెక్కనున్న ది ఐరన్‌ లేడీ చిత్రంలో నిత్యామీనన్‌ నటించనున్న విషయం తెలిసిందే. అలాంటిది తాజాగా నటుడు ధనుష్‌తో రొమాన్స్‌ చేసే అవకాశం ఈ అమ్మడిని వరించింది. వీరిద్దరి కాంబినేషన్‌లో తొలిసారిగా తెరకెక్కనున్న చిత్రం ఇదే అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా