వెరైటీ లవ్ స్టోరీతో నితిన్, పూరి జగన్నాథ్ చిత్రం

6 Jul, 2013 01:21 IST|Sakshi
వెరైటీ లవ్ స్టోరీతో నితిన్, పూరి జగన్నాథ్ చిత్రం

ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే విజయాలతో మంచి జోష్ మీదున్న నితిన్ బంపర్ ఆఫర్ కొట్టేశారు. త్వరలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన నటించబోతున్నారు. వైష్ణో అకాడమీ పతాకంపై స్వీయ దర్శకత్వంలో పూరీనే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
 
 ఆగస్ట్ 15నుంచి  ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. గోవా, యూరప్‌లలో జరిగే భారీ షెడ్యూల్లో ప్రధాన పాత్రలపై పూరి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. హీరోగా నితిన్‌ని మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.
 
 ఈ సినిమా గురించి నితిన్ మాట్లాడుతూ -‘‘పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనేది నా చిరకాల వాంఛ. ఇంతకాలానికి అది నెరవేరబోతోంది. పూరీగారు ఈ కథ చెప్పగానే ఎప్పుడెప్పుడు ఈ షూటింగ్ మొదలవుతుందా అనే ఉద్వేగం నా మనసులో మొదలైంది.
 
వాణిజ్య అంశాలు కలిగిన భిన్నమైన ప్రేమకథ ఇది’’ అని చెప్పారు. ఇద్దరు అగ్ర కథానాయి కలు నితిన్‌కి జోడీగా నటించే ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి