ఎప్పటివరకూ దాచేస్తారు?

7 Jun, 2017 01:31 IST|Sakshi
ఎప్పటివరకూ దాచేస్తారు?

నితిన్‌ ఏం దాచేస్తున్నాడు? అంటే తన ట్రెండీ యూత్‌ఫుల్‌ ఫేస్‌ అట! నితిన్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ ఫిల్మ్‌ ‘లై’. ఆల్రెడీ ఈ సిన్మాలో అతని ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. గుబురు గడ్డం, గుండ్రటి కళ్లద్దాలతో రీసెంట్‌గా నితిన్‌ చేసిన సినిమాలతో కంపేర్‌ చేస్తే లుక్‌ చాలా డిఫరెంట్‌గా ఉంది. లేటెస్ట్‌ న్యూస్‌ ఏంటంటే... సినిమా అంతా నితిన్‌ ఈ లుక్కులో ఉండరట!

యూత్‌ఫుల్‌ ట్రెండీ లుక్‌ మరొకటి ఉందట. ఫ్లాష్‌బ్యాక్‌లోని ప్రేమకథలో ట్రెండీ లుక్‌లో కనిపిస్తారని కృష్ణానగర్‌ కుర్రాళ్లు చెప్పుకుంటున్నారు. మరి, ఆ లుక్‌ను సినిమా విడుదలకు ముందు బయటపెడతారో? లేక దాచేసి, తెర మీదే చూపిస్తారో? వెయిట్‌ అండ్‌ సీ! ‘అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ’ సినిమాల ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్‌ను కాలిఫోర్నియా (అమెరికా)లోని మొజావేలో ఉన్న మిడెస్ట్‌లో థౌజెండ్‌ ఫ్లైట్స్‌ మధ్య షూట్‌ చేస్తున్నారిప్పుడు.