సమస్యలతో పోరాటం

7 Jul, 2014 22:45 IST|Sakshi
సమస్యలతో పోరాటం

ఎన్నో ఆశలతో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టిన ఓ అమ్మాయి... అక్కడ ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది? అనే కథాంశంతో మలయాళంతో రూపొందిన చిత్రం ‘తలసమయమ్ ఒరు పెన్‌కుట్టి’. నిత్యామీనన్, ఉన్ని ముకుందన్, శ్వేతామీనన్ ప్రధాన పాత్రధారులు. టి.కె.రాజీవ్‌కుమార్ దర్శకుడు. ఈ చిత్రం తెలుగులో ‘ఈ వేళలో’ పేరుతో విడుదల కానుంది. వల్లభనేని అశోక్‌కుమార్ ఈ అనువాద చిత్రానికి నిర్మాత. జీవితా రాజశేఖర్ సమర్పకురాలు. శ్రీశరత్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. జయసుధ ఆడియో సీడీని ఆవిష్కరించి సముద్రాల గోవిందరాజులుకు అందించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా