‘పుష్ప’ సర్‌ప్రైజ్‌: బన్నీకి లవర్‌గా నివేదా

22 Apr, 2020 08:37 IST|Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రేజీ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘పుష్ప’. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంతో సినిమా షూటింగ్‌కు కొంత గ్యాప్‌ ఏర్పడటంతో చిత్ర యూనిట్‌ ప్రీ ప్రొడక్షన్‌ పనులు చూసుకుంటున్నారు. పనిలో పనిగా రష్మికా రాయలసీమ యాస నేర్చుకుంటున్నారు. సినిమాలో ఈ భామ అటవీశాఖ అధికారిగా కనిపించనున్నారు. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సినిమాలో రాయలసీమ లుక్‌లో కనిపించే బన్నీ స్టైల్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. ఆర్య, ఆర్య-2 తర్వాత  బన్నీ, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ పుష్ప. (పుష్ప కోసం రష్మిక ట్రైనింగ్‌‌)

ఇక ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ హీరో సునీల్‌ శెట్టి నటించనున్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన మరో ఆసక్తిర విషయం తెలిసింది. పుష్పలో నివేదా థామస్‌ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఇటీవల దర్బార్‌ సినిమాలో నటించిన నివేదా ఈ సినిమాలో రెండో హీరోయిన్‌గా నటించనున్నారు. అల్లు అర్జున్‌ లవర్‌గా ఆమె పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నివేదా పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న ‘వకీల్‌సాబ్’‌లో నటిస్తున్నారు. కాగా సునీల్‌ శెట్టి, నివేదా థామస్‌ ఇటీవల దర్బార్‌ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. (థాంక్యూ తమన్‌.. మాట నిలబెట్టుకున్నావ్‌ : బన్నీ)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు