పండగ బ్రేక్‌

14 Jan, 2020 02:03 IST|Sakshi
నాగచైతన్య

‘లవ్‌స్టోరీ’కి పండగ బ్రేక్‌ ఇచ్చారు నాగచైతన్య. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ‘లవ్‌స్టోరీ’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్, పి. రామ్మోహ¯Œ  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండో షెడ్యూల్‌ ఇటీవల హైదరాబాద్‌లో ముగిసింది. ఈ సంక్రాంతికి బ్రేక్‌ ఇచ్చి, ఆ వెంటనే తర్వాతి షెడ్యూల్‌ను మొదలుపెట్టాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇదే చివరి షెడ్యూల్‌ అని, పాటలతో పాటు, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని సమాచారం. ఈ సంక్రాంతికి అక్కినేని ఫ్యాన్స్‌కి చిత్రబృందం ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వనుందట. ఈ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు