జెట్‌ స్పీడ్‌!

6 Jan, 2019 02:25 IST|Sakshi

సినిమా సినిమాకు మధ్యలో గ్యాప్‌ ఇవ్వడం లేదు. నాలుగైదు నెలల గ్యాప్‌లోనే స్క్రీన్‌పై కనిపిస్తున్నారు రజనీకాంత్‌. ‘కాలా, 2.0, పేట్టా’ మూడు చిత్రాలు ఏడు నెలల గ్యాప్‌లో రిలీజŒ  అయ్యాయి. ఈ స్పీడ్‌ చూసి ఆశ్చర్యపడకమానలేం. సంక్రాంతికి కొత్త సినిమా ‘పేట్టా’ (తెలుగులో ‘పేట’)తో బరిలోకి దిగుతున్నారు. ఫిబ్రవరి నెలలో మురుగదాస్‌తో చేయనున్న ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నట్లు కోలీవుడ్‌ సమాచారం.

ఇది పూర్తిస్థాయి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా, రజనీను ఆయన ఫ్యాన్స్‌ ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఉండబోతోందని ఆ మధ్య ఓ ఫంక్షన్‌లో పేర్కొన్నారు మురగదాస్‌. ఆల్రెడీ మురుగదాస్‌తో ‘సర్కార్‌’, రజనీతో ‘పేట్టా’ సినిమాలను నిర్మించిన సన్‌ నెట్‌వర్క్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రజనీకాంత్‌ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ప్రవేశించాక సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టొచ్చనే టాక్‌ కూడా తమిళనాడులో ఉంది. అందుకోసమే ఇలా గ్యాప్‌ లేకుండా జెట్‌ స్పీడ్‌తో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తున్నారా?

మరిన్ని వార్తలు