'పెళ్లికి గిఫ్టులు తేవొద్దు.. విరాళాలు ఇవ్వండి'

28 May, 2014 12:30 IST|Sakshi
'పెళ్లికి గిఫ్టులు తేవొద్దు.. విరాళాలు ఇవ్వండి'
చెన్నై: పెళ్లికి వచ్చేటప్పుడు బహుమతులు తీసుకురాకండి... కాని తాను నిర్వహించే ఫౌండేషన్ కు విరాళలివ్వండి అంటూ సినీతార అమలా పాల్ బంధువులకు, సహచర తారలకు సూచించింది. జూన్ 12 తేదిన దర్శకుడు విజయ్ తో జరిగే  వివాహానికి బహుమతులు తీసుకురాకండి.. తన నిర్వహిస్తున్న ఎబిలిటి ఫౌండేషన్ కు విరాళాలు సమర్పించాలని తన వెడ్డింగ్ కార్డులో ప్రత్యేకంగా ప్రింట్ చేయించడం అందర్ని ఆకట్టుకుంది. 
 
ఇటీవల పెళ్లైన గాయని చిన్మయి శ్రీపాద కూడా ఇదే పద్దతిని అనుసరించారు. చిన్మయి శ్రీపాద దారిలోనే అమలాపాల్ నడుస్తోంది. దైవ తిరుమగల్ చిత్ర షూటింగ్ లో ప్రేమలో పడిన విజయ్, అమలాపాల్ ల వ్యవహారం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. అయితే అన్ని ఊహాగానాలకు తెరదించుతూ జూన్ 12 తేదిన వివాహం చేసుకోనున్నారు. పెళ్లి తర్వాత అమలాపాల్ నటనకు స్వస్తి చెప్పనున్నారు.