'రుద్రమదేవిలో మహేశ్ బాబు నటించడం లేదు'

30 Jul, 2013 21:07 IST|Sakshi
'రుద్రమదేవిలో మహేశ్ బాబు నటించడం లేదు'
రుద్రమదేవి చిత్రంలో మహేశ్ బాబు ప్రత్యేక పాత్రలో నటించాడనే రూమర్ ఇటీవల ఫిలింనగర్ లో హోరెత్తింది. గుణ శేఖర్ దర్శకత్తం వహిస్తున్నచారిత్రాత్మక 'రుద్రమ దేవి' చిత్రంలో అనుష్క  టైటిల్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఇటీవల ఈ చిత్రంలో మహేశ్ బాబు, అనుష్కలపై కొన్ని సీన్లు చిత్రీకరణ జరిపారని వార్తలు వెలువడ్డాయి. అంతేకాక షూటింగ్ లో భాగంగా మహేశ్ కత్తి విసరగా అనుష్కకు గాయమైందని కూడా వెబ్ సైట్లు ప్రచురించాయి. అయితే రుద్రమ దేవి చిత్రంలో మహేశ్ బాబు నటించారనే వార్తలను ఆయన సన్నిహితుడొకరు ఖండించారు. 
 
రుద్రమ దేవి చిత్రంలోని గోన గన్నారెడ్డి పాత్రను పోషించాల్సిందిగా మహేశ్ ను గుణ శేఖర్ సంప్రదించారని.. అందుకు ప్రిన్స్ నిరాకరించారని తెలిపారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'నెంబర్ వన్' చిత్రంలో బిజీగా ఉన్నాడు. సుకుమార్ చిత్రాన్ని పూర్తి చేసుకుని, శ్రీను వైట్ల ఆగడు చిత్రానికి మహేశ్ సిద్ధమవుతున్నాడు.