చేతులు కలపను

10 Jul, 2020 00:50 IST|Sakshi
దిగంగనా సూర్యవన్షీ,

దిగంగనా సూర్యవన్షీ

సినిమా షూటింగ్స్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కొందరు నటీనటులు లొకేషన్‌లోకి అడుగుపెట్టేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. వారిలో కథానాయిక దిగంగనా సూర్యవన్షీ ఒకరు. మరి... షూటింగ్‌లో పాల్గొనడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అని దిగంగనా సూర్యవన్షీని అడిగితే – ‘‘షూటింగ్స్‌ మెల్లిగా మొదలవుతుండటం నాకు సంతోషంగా ఉంది. సినిమాలు తీసే ఆయా నిర్మాణ సంస్థలు యూనిట్‌ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని ఏర్పాట్లు చేస్తారు.

కానీ మా వంతు జాగ్రత్తల్లో మేం ఉండాలి. ఇకపై సెట్స్‌లో నేను ఎవరితోనూ చేతులు కలపను (నవ్వుతూ). అదేనండీ.. షేక్‌హ్యాండ్‌ ఇవ్వను. అలాగే వీలైనంత వరకూ ఇంట్లో చేసిన వంటకాలను తెచ్చుకోవాలనుకుంటున్నాను. బేసిక్‌ మేకప్‌ చేసుకోగలను. అందుకని లైట్‌ మేకప్‌ చాలనే సన్నివేశాలకు నేనే మేకప్‌ చేసుకోవాలనుకుంటున్నాను’’ అన్నారు. గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సీటీమార్‌’ చిత్రంలో దిగంగనా ఓ హీరోయిన్‌గా చేస్తున్నారు. తమన్నా మరో హీరోయిన్‌. ఈ సినిమా షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా