టైటిల్ కష్టాల్లో మరో స్టార్ హీరో

23 Mar, 2017 15:19 IST|Sakshi
టైటిల్ కష్టాల్లో మరో స్టార్ హీరో

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు సూపర్ ఫాంలో ఉన్నాడు.  వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ ప్రస్తుతం తన కెరీర్ లోనే తొలి సారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ తెనండల్ ఫిలింస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. విజయ్ సరసన కాజల్, సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు.

ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు దళపతి అనే టైటిల్ నిర్ణయించారు. అయితే రజనీకాంత్ హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన దళపతి సినిమాను నిర్మించిన జీవీ ఫిలింస్ ను టైటిల్ విషయమై విజయ్ టీం సంప్రదించగా.. జీవీ టీం నో చెప్పిందట. దీంతో మరో దారి లేక వేరే టైటిల్ ను నిర్ణయించే పనిలో పడ్డారు చిత్రయూనిట్. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ లోగోను రిలీజ్ చేయనున్నారు.