బాహుబలి, శ్రీమంతుడు పోటాపోటీ

8 Jun, 2016 14:30 IST|Sakshi
బాహుబలి, శ్రీమంతుడు పోటాపోటీ

రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబులు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. ఆ ఇద్దరి సినిమాలకు సంబంధించిన ఇతర నటులు, సాంకేతిక నిపుణులు కూడా బరిలోకి దిగి ఒకరిపై ఒకరు కాలుదూస్తున్నారు. 63వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో.. ప్రభాస్ బాహుబలికి 9 నామినేషన్లు దక్కగా, మహేశ్ శ్రీమంతుడు సినిమాకు 8 నామినేషన్లు దక్కాయి. దీంతో పలు కేటగిరిల్లో ఈ రెండు సినిమాల మధ్య సరవత్తర పోటీ ఏర్పాడనుంది.

చిన్న సినిమాగా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన 'మళ్లీ మళ్లీ రానిరోజు' సినిమాకు ఐదు నామినేషన్లు దక్కాయి. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా అందజేసే ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలకు ఈ ఏడాది హైదరాబాద్‌ వేదికగా నిలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఉత్తమ సినిమాలకు అందించే 63వ ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాల వేడుకను హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించనున్నారు. ఈనెల 18న జరగనున్న వేడుకకు నాలుగు భాషల నటీనటులు తరలిరానున్నారు. నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి..

ఉత్తం సినిమా
బాహుబలి
భలే భలే మగాడివోయ్
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
కంచె
శ్రీమంతుడు

ఉత్తమ దర్శకుడు
కొరటాల శివ(శ్రీమంతుడు), క్రాంతి మాధవ్(మళ్లీ మళ్లీ..), క్రిష్ (కంచె), రాజమౌళి(బాహుబలి), త్రివిక్రమ్(సన్ ఆఫ్ సత్యమూర్తి)

ఉత్తమ నటుడు
అల్లు అర్జున్(సత్యమూర్తి), మహేశ్ బాబు(శ్రీమంతుడు), నాని(భలే భలే..), జూ. ఎన్టీఆర్(టెంపర్), ప్రభాస్(బాహుబలి)

ఉత్తమ నటి
అనుష్క(రుద్రమదేవి), హెబా పటేల్(కుమారి 21 ఎఫ్), నిత్యా మీనన్(మళ్లీ మళ్లీ), శృతి హాసన్(శ్రీమంతుడు), తమన్నా(బాహుబలి)

ఉత్తమ సహాయ నటుడు
అల్లు అర్జున్(రుద్రమదేవి), జగపతిబాబు(శ్రీమంతుడు), పోసాని కృష్ణ మురళి(టెంపర్), రాణా(బాహుబలి), సత్యరాజ్(బాహుబలి)

ఉత్తమ సహాయ నటి
కృతి కర్బందా(బ్రూస్ లీ), పవిత్రా లోకేశ్(మళ్లీ మళ్లీ), రమ్యకృష్ణ(బాహుబలి), రేవతి(లోఫర్), సుక్రీతి (కేరింత)

బెస్ట్ మ్యూజిక్
అనూప్ రూబెన్స్(గోపాల గోపాల), చిరంతన్ భట్ (కంచె), దేవీ శ్రీ ప్రసాద్(శ్రీమంతుడు), గోపీ సుందర్(మళ్లీ మళ్లీ), కీరవాణి(బాహుబలి)

బెస్ట్ లిరిక్స్
అనంత శ్రీరామ్(మేఘాలు లేకున్నా- కుమారి 21 ఎఫ్), చంద్రబోస్(ఎందుకో ఈ వేళ- గోపాల గోపాల), రామజోగయ్య శాస్త్రి(పోరా శ్రీమంతుడా- శ్రీమంతుడు), సీతారామశాస్త్రి(రా ముందడుగేద్దాం- కంచె), శ్రీమణి((శీతాకాం సూర్యుడిలాగా- సన్ ఆఫ్ సత్యమూర్తి)

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్)
ధనుంజయ్ (భాజే భాజే- గోపాల గోపాల), కీర్తి సంఘాటియా (నీకు తెలియనిదా నేస్తమా- కంచె), ఎంఎల్ఆర్ కార్తికేయన్(పోరా శ్రీమంతుడా శ్రీమంతుడు), యాజిన్ నిజార్ (చారుశీలా- శ్రీమంతుడు), యాజిన్ నిజార్(మేఘాలు లేకున్నా- కుమారి 21 ఎఫ్)

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (ఫిమేల్)
ఐశ్వర్య(మర్హబా- మళ్లీ మళ్లీ ఇది రాని రోజు), గీతా మాధురి(జీవనది- బాహుబలి), జొనితా గాంధీ(ఈ కథ- కేరింత), మోహన భోజరాజు(సైజ్ సెక్సీ- సైజ్ జీరో), శ్రీయా ఘోషాల్(నిజమేనని- కంచె)

>