నాన్‌స్టాప్ వినోదం

25 Jan, 2014 01:11 IST|Sakshi
నాన్‌స్టాప్ వినోదం

 2013లో ‘బ్లాక్ బస్టర్ ఆఫ్ ది బాలీవుడ్’ ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం ‘చెన్నైఎక్స్‌ప్రెస్’. షారుక్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా రోహిత్‌శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వసూళ్లపరంగా సంచలనం సృష్టించింది. దక్షిణాది సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కథాకథనాలతో రూపొందిన ఈ చిత్రం రేపు ఆదివారం జీ తెలుగు చానల్‌లో సాయంత్రం 5.30 గంటలకు ప్రసారం కానుంది. ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులకు నాన్‌స్టాప్ వినోదాన్ని అందిస్తుందని జీ తెలుగు ప్రతినిధి తెలిపారు.