వేదికపై ఏడ్చేసిన నటి

31 Oct, 2019 15:48 IST|Sakshi

కొన్ని సార్లు అభిమాల అత్యుత్సాహం సినీ ప్రముఖలకు ఇబ్బందిగా మారుతోందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి అనుభవమే మలయాళ నటి నూరిన్‌ షెరీఫ్‌కు ఎదురైంది. మంజేరిలో ఓ సూపర్‌ మార్కెట్‌ ప్రారంభానికి వచ్చిన ఆమెను అభిమానులు చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఆమె ముక్కుకు గాయమైంది. దీంతో బాధను భరించలేక ఆమె వేదికపైనే ఏడ్చేశారు. ఆ తర్వాత బాధను కంట్రోల్‌ చేసుకుంటూ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. నూరిన్‌ ఇటీవల ఓ సూపర్‌ మార్కెట్‌ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే తొలుత నిర్వాహకులు కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతుందని నూరిన్‌కు చెప్పారు. దీంతో ఆమె తన తల్లితో కలిసి నాలుగు గంటలకే హోటల్‌కు చేరుకున్నారు. కానీ ఆ కార్యక్రమ నిర్వాహకులు ఎక్కువ మంది హాజరయ్యేందుకు వీలుగా.. సాయంత్రం 6 గంటల వరకు హోటల్‌లోనే ఉండాలని నూరిన్‌ను కోరారు. 

అనంతరం నిర్వహకులు చెప్పిన సమయానికి నూరిన్‌ అక్కడికి చేరుకున్నారు. అయితే నూరిన్‌ ఆలస్యంగా వచ్చారని భావించిన అక్కడి జనాలు.. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నూరిన్‌పై తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. పలువురు నూరిన్‌ కారును బాదడం మొదలుపెట్టారు. అసభ్య పదజాలంతో కూడా దూషించారు. నూరిన్‌ కిందికి దిగగానే ఓ వ్యక్తి చేయి నూరిన్‌ ముక్కుకు బలంగా తాకింది. ఈ ఘటనలో నూరిన్‌ ముక్కు లోపల గాయమైంది. దీంతో బాధను ఆపుకోలేక నూరిన్‌ స్టేజ్‌పైనే ఏడ్చేశారు. ఆ తర్వాత తన బాధను కంట్రోల్‌ చేసుకుంటూ ఆ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కాసేపు ప్రశాంతంగా ఉండాలని జనాలను కోరారు. ఆలస్యంగా రావడంలో తన తప్పేమీ లేదని స్పష్టం చేశారు. కాగా, మలయాళంలో సంచలనం సృష్టించిన ‘ఒరు ఆదార్‌ లవ్‌’ చిత్రం నూరిన్‌కు మంచి పేరు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా