‘అతడి పేరు కూడా తెలీదు.. ఇంకా వివాహమా’

18 Jul, 2018 20:39 IST|Sakshi

సాక్షి, ముంబై : ప్రాణ స్నేహితుల్లా మెలిగిన, ప్రేమించుకున్న వ్యక్తులను బ్రేకప్‌ తర్వాత మీ బంధం ఎలా ఉందని అడిగితే ఎవరికైనా కోపం, చిరాకు రావడం సహజం. ప్రస్తుతం బాలీవుడ్‌ నటి, మోడల్‌ నోరా ఫతేహి పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. మూడేళ్ల పాటు నటుడు అంగద్‌ బేడీతో రిలేషన్‌ షిప్‌లో ఉన్న నోరా... గతంలో అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇద్దరి పుట్టిన రోజు కూడా ఒకటే కావడంతో సంతోషం పట్టలేని ఆమె.. వారిద్దరి ఫొటోలను షేర్‌ చేసి ‘హ్యాపీ బర్త్‌డే అంగద్‌.. మనం ఇద్దరం ఒకే తేదీన పుట్టడం ఎంతో బాగుంది కదా. నువ్వు అచ్చం నాలాగే ఎందుకు ఉంటావో ఇప్పుడు తెలిసింది బెస్టీ అంటూ’ ట్వీట్‌ చేశారు. ఇందుకు బదులుగా.. ‘ హ్యాపీ బర్త్‌ డే సూపర్‌ స్టార్‌.. నీతో ఈ రోజును పంచుకోవడం నా అదృష్టం’ అంటూ అంగద్‌ ట్వీట్‌ చేశాడు.  

అయితే నోరాతో బ్రేకప్‌ అనంతరం అంగద్‌.. బాలీవుడ్‌ హీరోయిన్‌ నేహా ధుపియాను గత మేలో వివాహం చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల మధ్య పంజాబీ సంప్రదాయంలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ​కాగా ఇటీవల ఓ జాతీయ మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో భాగంగా.. అంగద్‌ బేడీకి వివాహ శుభాకాంక్షలు తెలిపారా అంటూ నోరా ఫతేహిని యాంకర్‌ ప్రశ్నించారు. దీంతో చిరాకు పడిన నోరా..‘అంగద్‌ బేడీ ఎవరు. అతడి పేరు కూడా ఎప్పుడూ వినలేదు. అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అతడు ఎవరో కూడా తెలియనపుడు అతడి పెళ్లి గురించి నేనెలా మాట్లాడతానంటూ’ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు