‘అరవింద సమేత’ నుంచి సర్‌ప్రైజ్‌!

17 Sep, 2018 12:55 IST|Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ ‘అరవింద సమేత’ . ఎన్టీఆర్‌ ఫస్ట్‌ లుక్‌, టీజర్‌తో అంచనాలను పెంచేసింది చిత్రయూనిట్‌. తాజాగా సినిమాకు సంబందించి ఓ సర్‌ప్రైజ్‌ను ప్లాన్‌ చేశారు మేకర్స్‌.

ఇటీవలె విడుదల చేసిన ‘అనగనగనగా’ లిరికల్‌ సాంగ్‌ వైరల్‌గా మారింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను నేరుగా మార్కెట్‌లోకి సెప్టెంబర్‌ 20న విడుదల చేయనున్నట్లు, ఆ తరువాత సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ప్లాన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాక రేపు ( సెప్టెంబర్‌ 18) మరో సర్‌ప్రైజ్‌ను ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి థమన్‌ సంగీతమందిస్తున్నారు. దసరా కానుకగా ఈ మూవీని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా