అండగా నిలిచారు, బిగ్ థ్యాంక్స్: ఎన్టీఆర్

20 May, 2018 19:36 IST|Sakshi
యంగ్ టైగర్ ఎన్టీఆర్

సాక్షి, హైదరాబాద్‌: నా కష్టసుఖాల్లో శాశ్వతంగా తోడున్నది ప్రేమ, మీ ఆదరణే అంటూ అభిమానులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా వరుస ట్వీట్లు చేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘నా 35 ఏళ్ల జీవితంలో 18 ఏళ్లుగా నటుడిగా కొనసాగుతున్నాను. ఇన్నేళ్ల నా కెరీర్‌లో కష్టసుఖాల్లో నాకు శాశ్వతంగా తోడున్నది, అండగా నిలిచింది ప్రేక్షకుల ప్రేమ, అదరణే. మీ రుణం తీర్చుకోగలుగుతానని భావించడం లేదు. అభిమానులకు హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

‘‘అరవింద సమేత.. వీర రాఘవ’ ఫస్ట్‌లుక్‌ను ఆధరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మీ ట్వీట్లు చదువుతుంటే చాలా గొప్పగా అనిపిస్తోంది. నా కొలిగ్స్‌కి, నా శ్రేయోభిలాషులు, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ బిగ్ థ్యాంక్స్’అని మరో ట్వీట్‌లో రాసుకొచ్చారు తారక్. కాగా, నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘అరవింద సమేత..’ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తారక్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ మూవీని  హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. నిన్న సిక్స్‌ ప్యాక్‌లో మాస్‌ లుక్‌ను విడుదల చేసిన మూవీ యూనిట్ ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా ఆదివారం క్లాస్ లుక్‌లో పూజా హెగ్డేతో ఉన్న లుక్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా