ఎన్టీఆర్‌ బయోపిక్‌... కాస్టింగ్‌ మామూలుగా లేదు!

10 Apr, 2018 14:23 IST|Sakshi

బాలకృష్ణ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితాన్ని సినిమాగా తెరకెక్కించడం మామూలు విషయం కాదు. తెలుగు తెరపై ఎన్టీఆర్‌ ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. బాలయ్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కాబట్టి సినిమాలో వివాదాలకు సంబంధించిన అంశాలు ఉండకపోవచ్చు. అయితే ఈ సినిమాలో కాస్టింగ్‌కు సంబంధించి పూటకో వార్త బయటకి వస్తోంది.

ఎన్టీఆర్‌ సినీజీవితం ఎంత చెప్పుకుంటే అంత మిగిలిపోతుంది. అయితే ఈ సినిమాలో జయలలిత పాత్రకు కాజల్‌, శ్రీదేవి పాత్రకు దీపికా పదుకొణే, సూపర్‌ స్టార్‌ కృష్ణ పాత్రకు మహేశ్‌ బాబును తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇంకా ఈ సినిమాలో పెద్ద స్టార్‌ హీరోలను తీసుకునే ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే హరికృష్ణ పాత్రలో నందమూరి కల్యాణ్‌రామ్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. నారా రోహిత్‌, తారక రత్నలు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

మరిన్ని వార్తలు