జై లవ కుశ ఆడియో రిలీజ్ డేట్..?

25 Jul, 2017 15:53 IST|Sakshi
జై లవ కుశ ఆడియో రిలీజ్ డేట్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా శరవేగంగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన తొలి టీజర్ కు మంచి రెస్పాన్స్ రావటంతో ఇప్పుడు అభిమానులు ఆడియో రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.

దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోను ఆగస్టు 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం పూణెలోని ఓ భారీ భవంతిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. గతంలో బాలీవుడ్ మూవీ రామ్ లీలాను షూట్ చేసిన భవంతిలో విలన్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆగస్టు లోనే షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి