తిరుమలలో 'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్ర యూనిట్

8 Jan, 2019 08:47 IST|Sakshi

సాక్షి, తిరుమల : 'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్ర యూనిట్ సభ్యులు మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఎన్టీఆర్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పార్టు ఎన్టీఆర్ కథానాయకుడు రేపు(బుధవారం) రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో హీరో నందమూరి బాలకృష్ణ, విద్యా బాలన్, సుమంత్ తదితరులు ఈ ఉదయం స్వామి వారిని దర్శించుకున్నారు.

స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామని హీరో నందమూరి బాలకృష్ణ తెలిపారు. నాన్న గారి సినిమా మంచి విజయం సాధించాలని స్వామివారిని వేడుకున్నామని ఆయన చెప్పారు. నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ బయోపిక్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించారు దర్శకుడు క్రిష్.

మరిన్ని వార్తలు