ఎన్టీఆర్ డేట్ ఫిక్స్ చేసేశాడు

16 Jan, 2016 08:44 IST|Sakshi
ఎన్టీఆర్ డేట్ ఫిక్స్ చేసేశాడు

సంక్రాంతికి నాన్నకు ప్రేమతో అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శతక్వంలో 'జనతా గ్యారేజ్' సినిమాను ప్రారంభించాడు ఎన్టీఆర్. ఫిబ్రవరి 10 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ మాత్రం వారం రోజులు ఆలస్యంగా అంటే ఫిబ్రవరి 17 నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉన్న ఈ సినిమాకు అప్పుడే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశాడు జూనియర్. జనతా గ్యారేజ్ ను ఆగస్టు 12న ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు. నాన్నకు ప్రేమతో విషయంలోనూ ముందుగానే డేట్ ఎనౌన్స్ చేసి అనుకున్న సమయానికి రిలీజ్ చేసిన ఎన్టీఆర్ మంచి రిజల్ట్‌నే రాబట్టాడు. అదే ఊపులో మరోసారి పక్కా ప్లాన్‌తో జనతా గ్యారేజ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

తొలి షెడ్యూల్ షూట్ కోసం సారథి స్టూడియోస్‌లో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నాడు ఆర్ట్ డైరెక్టర్ ఎయస్ ప్రకాష్. ఈ సెట్లో ఎన్టీఆర్, సమంత, మోహన్ లాల్ల పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. నిత్యామీనన్ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.