యంగ్‌ టైగర్‌ వర్సెస్‌ రియల్‌ టైగర్‌?

13 Sep, 2019 02:41 IST|Sakshi

రాజమౌళి సినిమాల్లో హీరో పరిచయ సన్నివేశాలు ఎక్స్‌ట్రా స్పెషల్‌గా ఉంటాయి. ‘యమదొంగ’ సినిమా అందుకు ఓ ఉదాహరణ. సర్కస్‌లో ‘పులిని మనిషిగా మార్చు.. చూద్దాం’ అని ఓ ప్రేక్షకుడు అడగడంతో మెజీషియన్‌ అలీ నిజమైన పులిని ఎన్టీఆర్‌గా మార్చుతాడు. అది ఎన్టీఆర్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌. ఈ సీన్‌కి విపరీతమైన విజిల్సూ, క్లాప్స్‌ పడ్డాయి.

ఇప్పుడు మరోసారి రియల్‌ టైగర్‌ని, యంగ్‌ టైగర్‌ని ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకురావాలనుకుంటున్నారట దర్శకుడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. డీవీవీ దానయ్య నిర్మాత. ప్రస్తుతం ఎన్టీఆర్‌కు సంబంధించిన పరిచయ సన్నివేశాలను బల్గేరియాలో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సన్నివేశాల్లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ రియల్‌ టైగర్‌తో నటిస్తున్నారని తెలిసింది. ఈ సన్నివేశాల్లో వీఎఫ్‌ఎక్స్‌ హైలెట్‌గా నిలుస్తుందట. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం వచ్చే ఏడాది జూలైలో రిలీజ్‌ కానుంది.

మరిన్ని వార్తలు