ఎన్టీఆర్ పాట.. నాని ఆట

13 Sep, 2016 10:21 IST|Sakshi
ఎన్టీఆర్ పాట.. నాని ఆట

హీరోగా తిరుగులేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో ఎన్టీఆర్. హ్యాట్రిక్ హిట్లతో మంచి ఫాంలో ఉన్న జూనియర్, గాయకుడిగానూ సత్తా చాటుతున్నాడు. తాను హీరోగా తెరకెక్కిన యమదొంగ, కంత్రి, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాల్లో గాయకుడిగా అలరించిన జూనియర్, ఇటీవల కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కోసం ఓ పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

అదే జోరులో ఇప్పుడు ఓ తెలుగు హీరో కోసం గాయకుడిగా మారనున్నాడు. మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని, ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో నేను లోకల్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దేవీతో మంచి స్నేహం ఉన్న ఎన్టీఆర్, నేను లోకల్ సినిమాలో పాట పాడేందుకు అంగీకరించాడట. త్వరలోనే ఈ పాటను రికార్డ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.