బాలీవుడ్ సినిమాపై ఎన్టీఆర్ ట్వీట్

29 Jan, 2017 11:17 IST|Sakshi
బాలీవుడ్ సినిమాపై ఎన్టీఆర్ ట్వీట్

సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా కనిపించిన యంగ్ హీరో ఎన్టీఆర్ సోషల్ మీడియా పేజ్‌లో ఇంట్రస్టింగ్ ట్వీట్ ఒకటి దర్శనమిచ్చింది. పెద్దగా ఇతర హీరోల సినిమాల గురించి ట్వీట్ చేయని ఎన్టీఆర్ ఈ మధ్య బాబాయ్ హీరోగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి టీంకు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ ఇప్పుడు ఓ బాలీవుడ్ హీరో సినిమాకు విషెస్ చెప్పాడు.

సౌత్‌లో విలన్‌గా సోపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా నటించిన విద్యుత్ జమాల్ బాలీవుడ్లో హీరోగా తెరకెక్కిన సినిమా కమాండో. ఈ సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న కమాండో 2 తెలుగులో రిలీజ్ అవుతున్న సందర్భంగా ఎన్టీఆర్ జమాల్‌కు విషెస్ చెప్పాడు. 'నా ప్రియమైన స్నేహితుడు విద్యుత్ జమాల్ హీరోగా తెరకెక్కిన కమాండో 2 తెలుగులో  వస్తోంది. అతడికి ఆల్ ద బెస్ట్' అని ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన శక్తి, ఊసరవెల్లి సినిమాల్లో జమాల్ కీలక పాత్రల్లో నటించాడు.