అప్పుడే ఏడాది అయిపోయింది: ఎన్టీఆర్‌

14 Jun, 2019 10:41 IST|Sakshi

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సినిమాలతో ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీకి మాత్రం కావల్సినంత సమయాన్ని కేటాయిస్తాడు. పుట్టిన రోజు, పెళ్లి రోజు లాంటి స్పెషల్‌ డే అయితే ఫ్యామిలీతోనే గడుపుతాడు. ఈ ఏడాది ఎన్టీఆర్ పుట్టిన రోజు, పెళ్లి రోజున సోషల్‌మీడియాలో ట్వీట్లు, పోస్ట్‌లు హోరెత్తించాయి. ఎన్టీఆర్‌ తన పెద్ద కుమారడు అభయ్‌ రామ్‌ చేసే అల్లరి గురించి తన అభిమానులకు సోషల్‌ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ ఉంటాడు.

అయితే గతేడాది సరిగ్గా ఇదే రోజు.. తన కుటుంబంలోకి ఇంకొకరు వచ్చి చేరారని ట్వీట్‌ చేశాడు యంగ్‌టైగర్‌. తన చిన్న కుమారుడు భార్గవ్‌రామ్‌కు ఏడాది నిండాయని తెలిపాడు. నేడు భార్గవ్‌రామ్‌ మొదటి పుట్టినరోజును ఎన్టీఆర్‌ ఏవిధంగా సెలబ్రేట్‌ చేయనున్నాడో మరి. ఇక సినిమాల విషయానికొస్తే.. చేతికి గాయం కావడం వల్ల కొన్నిరోజులు విరామం తీసుకున్న ఎన్టీఆర్‌.. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ మీద కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు