హాలీవుడ్‌ కాన్సెప్ట్‌తో...

7 Mar, 2018 01:09 IST|Sakshi
సుధాకర్, నిత్యా శెట్టి

‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌‘ ఫేమ్‌ సుధాకర్‌ హీరోగా హరనాథ్‌ బాబు.బి దర్శకత్వంలో యునైటెడ్‌ ఫిలింస్‌ బ్యానర్‌ పై డి.శ్రీకాంత్‌ నిర్మిస్తున్న చిత్రం ‘నువ్వు తోపురా’. షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా హీరో సుధాకర్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ అన్ని ఎమోషన్స్‌తో కూడి ఉంటుంది.

యూత్‌ తమని తాము చూసుకునే రోల్‌ ఇది. ఫస్ట్‌ సినిమా అయినా కూడా మంచి సినిమా అందించాలని నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. ఈ సినిమా నాకు మంచి పేరు తీసుకు వస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.‘‘ఈ సినిమాను 70 శాతం అమెరికాలో, 30 శాతం ఇండియాలో షూట్‌ చేశాం. హాలీవుడ్‌ కాన్సెప్ట్‌తో దర్శకుడు హరినాథ్‌ రూపొందించాడు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. త్వరలోనే గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు నిర్మాత శ్రీకాంత్‌.

మరిన్ని వార్తలు