‘ఆయన రావడం మా అదృష్టం’

4 Mar, 2020 19:45 IST|Sakshi

విశ్వంత్‌, సంజయ్‌రావు, నిత్యాశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. బ్రహ్మాజీ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి చందు ముద్దు దర్శకత్వం వహించారు. భవ్యక్రియేషన్‌ పతాకంపై వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించారు. ఈ చిత్రంపై అందరిలోనూ అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అంతేకాకుండా మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు మెగాస్టార్‌ చిరంజీవి అతిథిగా రావడంతో టాలీవుడ్ ప్రధాన దృష్టి ఈ చిత్రంపై పడింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలు ఆకట్టుకున్నాయి. మార్చి 6న ఈ చిత్రం విడుదల అవుతున్న సందర్బంగా బ్రహ్మాజీ మీడియా సమావేశంలో మాట్లాడారు. 

ఓ పిట్టకథ ఎలా స్టార్ట్ అయ్యింది ?
ఓ పిట్టకథ సినిమా కథ ముందు నాకు దర్శకుడు సాగర్ చంద్ర నాకు రెఫర్ చేశాడు, తాను డైరెక్టర్ చెందును పరిచయం చేశాడు, చెందు కథ చెప్పగానే బాగా నచ్చి ప్రొసీడ్ అయ్యాం. తెలుగులో ఇంతవరకు రాని డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా రానుంది.

మీ పాత్ర గురించి ?
ఇది ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్, అమలాపురం లో ఉండే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో నటించాను. రెగ్యులర్ సినిమాతో మా అబ్బాయిని హీరోగా పరిచయం చెయ్యకుండా ఒక మంచి పాత్రలో మా అబ్బాయిని చూడాలని అనుకున్నాను, ఓ పిట్టకథ సినిమా కథలో మా అబ్బాయి పాత్ర నచ్చి ఈ సినిమా చెయ్యమని చెప్పాను. మా అబ్బాయి ఆర్టిస్ట్ కంటే ముందు డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. అక్కక కొన్ని విషయాలు నేర్చుకున్నారు. 

మీరు వర్క్ చేసిన హీరోల గురించి ?
ప్రస్తుతం ఉన్న మన తెలుగు హీరోలందరు కలసిమెలిసి ఉంటారు. కొందరు వారిని వేరుగా చూస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు, నాకు అందరూ హీరోలతో ఉన్న అనుబంధంతో అందరితో కలిసి నటించాను. ముఖ్యంగా చిరంజీవి గారు బిజీ షెడ్యూల్ లో మా పిట్టకథ సినిమా ఫంక్షన్ కు రావడం మా అదృష్టం. అలాగే మా టీజర్ ను విడుదల చేసిన మహేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 

ఓ పిట్టకథ ఎలా ఉండబోతొంది ?
కొత్తవారు చేసిన సినిమాలు చూడడానికి జనాలు ఎక్కువగా ఇష్టపడరు. ఇలాంటి సందర్భంలో ఆడియన్స్ ను అలరించాలి అంటే సినిమాలో కొత్తదనం ఉండాలి, ఓ పిట్టకథ సినిమా కంటెంట్ ఫ్రెష్ గా ఉండబోతొంది. ఇదివరకు విడుదలైన సాంగ్స్, ట్రైలర్స్ కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. కొంతమంది దర్శకులు ఓ పిట్టకథ సినిమా చూసి బాగుందని చెప్పారు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాకు కొన్ని మార్పులు చెప్పడం జరిగింది, ఆయన సూచనలు సినిమాకు హెల్ప్ అయ్యాయి. సినిమా పూర్తి అయ్యాక చంద్రశేఖర్ యేలేటి గారు సినిమా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. 

డైరెక్టర్ చందు ముద్దు గురించి ?
సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తారు. చాలా ఆసక్తికరంగా, గ్రిప్పింగ్ గా దర్శకుడు చందు ముద్దు సినిమాను తెరకెక్కించాడు. చాలా క్లారీటి ఉన్న దర్శకుడు తను, నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను మంచి నిర్మాణ విలువలతో నిర్మించారు.

తదుపరి చిత్రాలు ?
అల్లు అర్జున్ & సుకుమార్ సినిమా, చిరంజీవి కొరటాల శివ సినిమాల్లో నటిస్తున్నాను.

మరిన్ని వార్తలు