పిట్టకథే కానీ పెద్ద కథ

6 Feb, 2020 05:17 IST|Sakshi
బ్రహ్మాజీ, విశ్వంత్, నిత్యాశెట్టి, సంజయ్‌రావ్‌

‘‘పిట్టకథ టైటిల్‌ చాలా బాగుంది. ఇండస్ట్రీలో ఈ మధ్య పిట్టకథ గురించే చర్చ జరుగుతోంది. ఇది పిట్టకథే కానీ చాలా పెద్ద కథ అని నమ్ముతున్నాను. ‘ఓ పిట్టకథ’ ఈ వేసవిలో ప్రేక్షకులకు చల్లటి ఉపశమనం ఇస్తుంది’’ అని డైరెక్టర్‌ కొరటాల శివ అన్నారు. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ ముఖ్య తారలుగా చెందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేష¯Œ ్స పతాకంపై వి.ఆనంద ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా క్యారెక్టర్స్‌ పోస్టర్‌ను కొరటాల శివ ఆవిష్కరించారు. చెందు ముద్దు మాట్లాడుతూ– ‘‘ఒక పల్లెటూరులో జరిగే కథ ఇది. వినోదం, ఉత్కంఠను రేకెత్తిస్తుంది’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు వి.ఆనందప్రసాద్‌. ‘‘మార్చిలో సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత అన్నే రవి. ఈ చిత్రానికి కెమెరా: సునీల్‌ కుమార్‌ య¯Œ , సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు.

మరిన్ని వార్తలు