నేటి విద్యా వ్యవస్థను ఆవిష్కరించే తలైకీళ్

26 Apr, 2014 05:23 IST|Sakshi
నేటి విద్యా వ్యవస్థను ఆవిష్కరించే తలైకీళ్

ఉన్నత విద్యనభ్యసించి కుటుంబానికి, దేశానికి బాధ్యత గల పౌరులుగా సేవలందించాలని ఆశిస్తూ గ్రామాల నుంచి విద్యార్థులు నగరానికి వస్తుంటారు. తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి పిల్లలను చదివిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు దండు కోవడమే లక్ష్యంగా పనిచేసే కొన్ని కళాశాలలు, సీనియర్ల పేరుతో విద్యార్థుల ర్యాగింగ్, అవమానాలు తదితరాలను మార్చాలని ప్రయత్నించే ఓ యువ విద్యార్థి కథే తలై కీళ్ చిత్రమని దర్శకుడు రెక్స్‌రాజ్ తెలిపారు.

లండన్‌కు చెందిన ఈయన కథ, కథనం, మాటలు, పాటలు రాసి తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాతా క్రియేషన్ పతాకంపై ధరణియన్ నిర్మిస్తున్నారు.నవ నటుడు రాకేష్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో తేజామై, నివేదా హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువతను దృష్టిలో పెట్టుకుని జనరంజకంగా తెరకెక్కించిన తలైకీళ్ చిత్రాన్ని లియో ఇంటర్నేషనల్ పతాకంపై జేవీ రుక్మాంగదన్ విడుదల చేయనున్నారని దర్శకుడు తెలిపారు.

>