నేను వైల్డ్‌ హార్స్‌ని.. మంకీని కూడా

1 Jun, 2018 00:09 IST|Sakshi
రామ్‌గోపాల్‌ వర్మ, నాగార్జున, మైరా సరీన్‌

రామ్‌గోపాల్‌ వర్మ

‘‘ఆఫీసర్‌ ఒక సిన్సియర్‌ ఎఫర్ట్‌. చాలా ఎంజాయ్‌ చేస్తూ చేశాం. సినిమా మీద ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. స్క్రిప్ట్‌ వినగానే నచ్చింది. కానీ ఆర్జీవీ మీద నమ్మకం లేదు. నమ్మకం లేనిది ఆయన డైరెక్షన్‌ కేపబిలిటీ మీద, టాలెంట్‌ మీదా కాదు. ఆయన మూడ్‌ మీదే. అందుకే చిన్న టెస్ట్‌ పెట్టాను’’ అన్నారు నాగార్జున. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన చిత్రం ‘ఆఫీసర్‌’. మైరా సరీన్‌ కథానాయిక. కంపెనీ పతాకంపై సుధీర్‌ చంద్ర, రామ్‌గోపాల్‌ వర్మ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ – ‘‘వర్మ ఒక వైల్డ్‌ హార్స్‌. ఏదైనా ప్రాజెక్ట్‌ స్టార్ట్‌ చేసినా మధ్యలో దృష్టి మారిపోతుంటుంది. చేసే పని మీదే దృష్టి ఉండాలన్నది నా మనస్తత్వం. ‘ఈ సినిమా చేసి మళ్లీ  మనం గొడవలు పడటం ఎందుకు?’ అని వర్మతో అన్నాను. మళ్లీ ఇంకోసారి కథ చెప్పు అని రెండు మూడు సార్లు కలిశాను.  అలా తన కాన్‌సన్‌ట్రేషన్‌కు టెస్ట్‌ పెట్టాను. బాగా తీశాడు. సినిమా ఒప్పుకున్నాక నాకు రాసిన లెటర్‌లో తన్నమన్నాడు. తన్నాల్సిన అవసరం లేదు.

బాగా తీశాడు. ఆర్జీవి సౌండ్‌తో, బ్యాక్‌గ్రౌండ్‌తో ఆడుకుంటాడు. ఈ సినిమాలో కూడా సౌండ్‌ ఎక్స్‌పీరియన్స్‌ చాలా బావుంటుంది. సౌండ్‌ మీ గుండెల వరకూ వెళ్తుంది’’ అని అన్నారు.  రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ – ‘‘నేను సినిమాల్లో వైల్డ్‌ హార్స్‌ని. ట్వీటర్‌లో వైల్డ్‌ మంకీని. నేను సినిమాని సీరియస్‌గా తీసుకోను అన్నది అబద్ధం. చేసేటప్పుడు సీరియస్‌గా చేసి ఆ తర్వాత పక్కన పెట్టేస్తాను. ‘ఆఫీసర్‌’ సినిమాలో రియలిస్టిక్‌ యాక్షన్, సౌండ్‌... ఇలా కొన్ని అచీవ్‌ చేయాలని టార్గెట్‌ పెట్టుకొని చేశాను.

‘ఇలా చేయాలి’ అనే ఇన్‌టెన్షన్‌ ఉన్నప్పుడు అనుకున్నట్లే బాగా చేస్తాం. అందుకే నాగ్‌కి లెటర్‌లో తన్నమని రాశాను. రీచ్‌ అయ్యానో లేదో.. తన్నుడు కార్యక్రమం ఉందో లేదో చూడాలి. ‘ఆఫీసర్‌’ సినిమా కచ్చితంగా న్యూ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది అనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీ. ఈ అవకాశం ఇచ్చిన ఆర్జీవీకి, నాగార్జునకు చాలా థ్యాంక్స్‌. టిపికల్‌ హీరోయిన్‌ రోల్‌ చేయలేదు. చాలా పవర్‌ఫుల్‌ పాత్ర ప్లే చేశాను. స్టంట్స్‌ కూడా చేశాను’’ అని అన్నారు మైరా సరీన్‌.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ ట్రెండింగ్‌పై నాగార్జున ట్వీట్‌

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు

భార్య కంటే కత్తి మంచిది

పిల్లల సక్సెస్‌ చూసినప్పుడే ఆనందం

కొంటె పిల్లడు.. గడసరి అమ్మడు

కొత్త కథల్ని ఆదరిస్తున్నారు

వాట్‌ నెక్ట్స్‌?

ఇక్కడ దీపిక.. అక్కడ మెరిల్‌

మొదటిరోజే హౌస్‌మేట్స్‌కు షాక్‌!

వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

ప్రియాంక స్మోకింగ్‌.. నెటిజన్ల ట్రోలింగ్‌

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

జూలై 25న ‘మ‌న్మథుడు 2’ ట్రైల‌ర్

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

వేదిక మీదే కుప్పకూలి.. హాస్య నటుడు మృతి

సేఫ్‌ జోన్‌లోకి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా

విదేశాల్లో వార్‌

సైగలే మాటలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ట్రెండింగ్‌పై నాగార్జున ట్వీట్‌

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి