మంచి సినిమాలే చేయాలనుకున్నా

7 Jun, 2019 00:52 IST|Sakshi
నందినీరెడ్డి, సమంత

‘‘సురేశ్‌ ప్రొడక్షన్స్‌ స్థాపించిన 55ఏళ్లలో తొలిసారి ఓ మహిళా డైరెక్టర్‌తో సినిమా చేశాం. నందినీతో ఎప్పుడో సినిమా చేయాల్సింది కానీ చేయలేకపోయాం. ఇప్పుడు కూడా నలుగురు నిర్మాతలు యూనిట్‌ అయ్యి ‘ఓ బేబీ’ సినిమా తీశాం’’ అని డి.సురేశ్‌బాబు అన్నారు. సమంత అక్కినేని, లక్ష్మి, నాగశౌర్య, రాజేంద్రప్రసాద్, రావు రమేష్‌ ముఖ్య తారలుగా బి.వి.నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. సురేశ్‌ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్‌ హు, థామస్‌ కిమ్‌ నిర్మించిన ఈ సినిమా జూలై 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఓ బేబి’ సినిమాకి ఎక్కువగా లేడీ యూనిట్‌ పనిచేశారు.

ఫస్ట్‌ టైమ్‌ నా బంధువు, నా ఫ్యామిలీ మెంబర్‌తో(సమంత) ఈ సినిమా చేశా. ఇంతకుముందు మా ఇంట్లో అబ్బాయిలు మాత్రమే సినిమాలు చేసేవారు ఇప్పుడు అమ్మాయి కూడా చేసేసింది. వెంకటేశ్, చైతన్య, రానా.. ఇప్పుడు సమంత. ఈ సినిమాని కొరియా హక్కులు కొని రీమేశాం. మన సినిమాలు కూడా తొందర్లో కొని ఫారిన్‌లో రీమేక్‌ చేస్తారు. ఇది మంచి ట్రెండ్‌’’ అన్నారు.    నందినీ రెడ్డి మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్‌గా నాకు ఫస్ట్‌ చెక్‌ ఇచ్చింది సురేశ్‌సారే.. సురేశ్‌ ప్రొడక్షన్‌లో నా తొలి సినిమా రావాల్సింది కానీ జరగలేదు. నా నాలుగో సినిమా ఈ ప్రొడక్షన్‌లో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది యూనివర్శల్‌ స్టోరీ. ఇప్పటి వరకూ సమంత చేసిన పాత్రలకంటే ‘ఓ బేబి’ లో ఎక్కువ షేడ్స్‌ కనిపిస్తాయి’’ అన్నారు.


సమంత మాట్లాడుతూ– ‘‘అదృష్టం అనేది ఉండొచ్చు. అయితే ‘మంచి సినిమాలు చేయాలి.. లేకపోతే ఇంట్లో కూర్చోవాలి’ అని నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. దాని తర్వాత వచ్చిన సినిమాలే ‘రంగస్థలం, మహానటి, సూపర్‌ డీలక్స్, మజిలీ’. నాకు ఓ చిన్న బాధ ఉండేది. నేను రిటైర్‌ అయ్యేలోపు ఓ పూర్తిస్థాయి వినోదాత్మక సినిమా చేయాలని. ‘ఓ బేబీ’ ద్వారా నాకు ఆ ఆశ తీరింది. ఈ సినిమా సురేశ్‌ ప్రొడక్షన్‌లో చేయడం సంతోషంగా ఉంది. సురేశ్‌గారు ఫోన్‌ చేసి సీన్స్‌ ఎలా వచ్చాయి అని అడిగేవారు. దీంతో నాకు ఓ బాధ్యత అనిపించి ఎడిటింగ్‌ రూమ్‌కి వెళ్లి రషెస్‌ చూసుకునేవాణ్ణి. ఈ సినిమా నాకు ఓ పాఠం నేర్పింది. ఈ సినిమా నా కెరీర్‌లో ఓ స్పెషల్‌ అవుతుందని నమ్ముతున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సునీత, నటుడు తేజ పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు