చిన్న విరామం

16 Sep, 2019 05:32 IST|Sakshi
సందీప్‌ చేగూరి, అమల, రాజ్‌ కందుకూరి, సంజయ్‌ వర్మ, గరిమా సింగ్‌

‘‘ఒక చిన్న విరామం’ సినిమా నా స్టూడెంట్స్‌ది. మా అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంలో కొత్తరకమైన, ప్రజలకు అవగాహన కల్పించే, ప్రేక్షకులను ఆకట్టుకునే, ట్రెండ్‌ని సెట్‌ చేసే సినిమాలు వస్తాయి. ఇప్పుడు  ‘అన్నపూర్ణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్, మీడియా’(ఏఐఎస్‌ఎఫ్‌ఎం) విద్యార్థులు.. అంటే నా స్టూడెంట్స్‌  తీసిన సినిమా కాబట్టి  పక్కాగా హిట్‌ అవుతుంది’’ అని  ఏఐఎస్‌ఎఫ్‌ఎం డైరెక్టర్‌ అక్కినేని అమల అన్నారు.  ఏఐఎస్‌ఎఫ్‌ఎం స్టూడెంట్‌ సందీప్‌ చేగూరి స్వీయ  దర్శకత్వంలో మూన్‌వాక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మించిన  ‘ఒక చిన్న విరామం’ సినిమా ఫస్ట్‌లుక్, సాంగ్‌ ప్రోమోను అమల విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మా ఫిల్మ్‌ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు మంచి ప్రతిభ ఉంది. దాంతో అద్భుతమైన చిత్రాలు తీయగలుగుతున్నారు.

‘ఒక చిన్న విరామం’ కచ్చితంగా  మంచి హిట్‌ సాధించి, సందీప్‌కి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం’’ అన్నారు. ‘‘నేను తీసే ప్రతి సినిమా ద్వారా 20 నుంచి 25మంది టాలెంటెడ్‌ యూత్‌ని సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నా. యంగ్‌స్టర్స్‌ అయితేనే బ్లాక్‌బస్టర్స్‌ ఇవ్వగలరు’’ అన్నారు నిర్మాత రాజ్‌ కందుకూరి. ‘‘సస్పెన్స్, రోడ్‌ థ్రిల్లర్‌తో తెరకెక్కిన సినిమా ఇది’’ అన్నారు సందీప్‌ చేగూరి. ‘‘ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు హీరో సంజయ్‌వర్మ, హీరోయిన్‌ గరిమాసింగ్‌. నటులు ధనరాజ్, నవీన్‌నెవి, కెమెరామన్‌ రోహిత్‌ బట్చు, సంగీత దర్శకుడు భరత్‌ మంచిరాజు, సౌండ్‌డిజైనర్‌ అశ్విన్‌బర్దేలు పాల్గొన్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు