సైకలాజికల్‌ థ్రిల్లర్‌

4 Aug, 2019 05:50 IST|Sakshi
దీపాలి, అఖిల్‌రెడ్డి, దీపిక

అరుణ– కళ్యాణి టాకీస్‌ పతాకంపై కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘ఒకడు’. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. అఖిల్‌రెడ్డి హీరోగా పరిచయమవుతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి శేఖర్‌ మాస్టర్‌ క్లాప్‌నివ్వగా, సత్య మాస్టర్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. స్క్రిప్ట్‌ను దర్శకుడు బీవీయస్‌ రవి దర్శకునికి అందించారు. ఈ సందర్బంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ – ‘‘ఇది నా మొదటి చిత్రం.

అందరూ అనుభవం ఉన్న టెక్నీషియన్లతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. సంగీత దర్శకులు మణిశర్మ గారు స్వరాలందించడం హ్యాపీ. మొత్తం ఐదు ఫెడ్యూల్స్‌లో సినిమా పూర్తి చేస్తాం ఈనెల 16న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ సినిమా మంచి మెసేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్ర నిర్మాత ముత్తయ్య అన్నారు.‘‘నేను చేస్తున్న మొదటి సినిమాకు మంచి స్క్రిప్ట్‌ కుదిరింది. మంచి సైకలాజికల్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం’’ అన్నారు అఖిల్‌రెడ్డి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు