రొమాన్స్ అంటే కష్టమంటున్న హీరోయిన్

1 Nov, 2016 09:14 IST|Sakshi
రొమాన్స్ అంటే కష్టమంటున్న హీరోయిన్
సినిమా షూటింగులో హీరోలతో కలిసి రొమాన్స్ చేయమంటే అది తనకు చాలా కష్టంగా ఉంటుందని హాలీవుడ్ హీరోయిన్ ఒలివా మన్ అంటోంది. ఇటీవల విడుదలైన ఎక్స్‌మెన్: అపోకలిప్స్ సినిమాలో నటించిన ఈ హీరోయిన్.. ఆన్‌స్క్రీన్ రొమాన్స్ విషయంలో తనకు ఉన్న కష్టాల గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడింది. ''ఎప్పుడైనా సినిమాలలో రొమాంటిక్ సన్నివేశాలు వచ్చినప్పుడు.. ముద్దు కాకుండా మరికొంత ముందుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు అది నాకు చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఏదో జరుగుతోందని ప్రేక్షకులకు చూపించాల్సి వచ్చినప్పుడు అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది'' అని ఆమె తెలిపింది. 
 
మహిళల విషయంలో ఇలాంటి సీన్లు రాసేటప్పుడు చాలా సాధారణంగా రాసేస్తారని.. కానీ నటించేటప్పుడు మాత్రం అది తనలాంటి వాళ్లకు కష్టం అవుతుందని చెప్పింది. తాను ఇప్పుడు నటిస్తున్న 'ఆఫీస్ క్రిస్టమస్ పార్టీ' సినిమా విషయం మాత్రం వేరేలా ఉంటుందని.. ఇందులో నిజజీవితంలో ఉండేలాంటి ఘటనలే కనిపిస్తాయని వివరించింది. మహిళలను తెరమీద చిత్రీకరిస్తున్న తీరు దారుణంగా ఉంటోందని.. ఈ విషయంలో సమాజం తీరు కూడా మారాలని ఒలివా మన్ చెప్పింది.
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి