రైట్‌ రైట్‌... మహాభారతం

20 Dec, 2017 00:32 IST|Sakshi

కౌరవులు, పాండవులు, ధర్మరాజు ధర్మాలు, దుర్యోధనుడి దురాగతాలు, శకుని కుట్రలు, కృష్ణుడి మాయలు, కర్ణుడి దానగుణం, అర్జునుడి పరాక్రమం, కురుక్షేత్ర రణరంగం... ‘మహాభారతం’ గురించి చెబుతున్నామన్న విషయం గ్రహించే ఉంటారు. సోనమ్‌ కపూర్‌కి ‘మహాభారతం’ అంటే ఇష్టం. అందుకే మహాభారతాన్ని సిల్వర్‌ స్క్రీన్‌పై చూపించాలనుకున్నారు. ‘మహాభారతం’ ఇతిహాసం ఆధారంగా సింగపూర్‌ బేస్డ్‌ రైటర్‌ కృష్ణ ఉదయశంకర్‌ ఓ నవల రాశారు.

ఇందులో ‘గోవిందా, కౌరవ, కురుక్షేత్ర’ అనే త్రీ పార్ట్స్‌ ఉన్నాయి. ఇందులోని ఫస్ట్‌ పార్ట్‌ ‘గోవిందా’ రైట్స్‌ను సోనమ్‌ కపూర్‌ కొన్నారు. ‘‘నేను ఏ క్యారెక్టర్‌ చేయబోతున్నానన్నది ప్రజెంట్‌ సస్పెన్స్‌. మహాభారతం గొప్ప పురాణ చరిత్ర’’ అని పేర్కొన్నారు సోనమ్‌. ఈ సంగతి ఇలా ఉంచితే.. సోనమ్‌ ఇది వరకే అనూజా చౌహాన్‌ రాసిన ‘బాటిల్‌ ఫర్‌ బిట్టోర’, ‘జోయా ఫ్యాక్టర్‌’ బుక్స్‌ ఆధారంగా సినిమాలు చేయాలనుకున్నారు. మరి..‘మహాభారతం’ పట్టాలెక్కేదెప్పుడు? ఈ బుక్స్‌ బేస్డ్‌ మూవీస్‌ ప్రారంభమయ్యేది ఎప్పుడు?

మరిన్ని వార్తలు