‘ఎన్టీఆర్‌ ఆశీస్సులు ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’కే’

16 Feb, 2019 16:17 IST|Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ వేడిని మరింత రాజేసింది. ఈ ట్రైలర్‌కు భారీ రెస్సాన్స్‌రావటమే కాదు రికార్డ్ వ్యూస్‌తో సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది.

తాజాగా ఈ విషయాన్ని రామ్‌ గోపాల్‌ వర్మ అభిమానులతో పంచుకున్నారు. రిలీజ్‌ అయిన గంటన్నరలోనే మిలియన్‌ వ్యూస్‌ సాధించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ట్రైలర్‌ రెండు రోజుల్లో కోటి వ్యూస్‌ సాధించినట్టుగా వర్మ ప్రకటించాడు. వివిధ యూట్యూబ్‌ చానల్స్‌తో పాటు సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్స్‌ అన్నింటిలో కలిపి ఈ వ్యూస్‌ సాధించినట్టుగా వర్మ తెలిపాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్ మార్చి మొదటి వారంలో విడుదల కానుంది.


Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు