స్కామ్‌ ఆధారంగా...

3 Dec, 2019 00:30 IST|Sakshi
మైరా అమితి

చెంగ్, మైరా అమితి జంటగా విఘ్నేష్‌ కలగర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓన్లీ నేను’. శ్రీనివాస్‌ శరకడం నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. అతిథిగా విచ్చేసిన దర్శకుడు, నటుడు కాశీ విశ్వనాథ్‌ మాట్లాడుతూ– ‘‘ఓన్లీ నేను’ ట్రైలర్‌ బావుంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ హైలైట్‌. శ్రీనివాస్‌గారు ఈ నెల 15న చేపట్టబోతున్న ‘ఇండియన్‌ ఫ్యాషన్‌ అండ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ కొత్త డైరెక్టర్స్, కొత్త నిర్మాతలకు మంచి వేదిక అవుతుంది’’ అన్నారు.

‘‘ఔత్సాహికులు తమ ప్రతిభని నిరూపించుకోవడానికి ఇండియన్‌ ఫ్యాషన్‌ అండ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ కార్యక్రమం ఓ మంచి ప్లాట్‌ఫామ్‌’’ అన్నారు తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్‌ మామిడి హరికృష్ణ. ‘‘ఇండియన్‌ ఫ్యాషన్‌ అండ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ఔత్సాహిక దర్శకుల టీజర్స్, కాన్సెప్ట్‌లను ప్రదర్శిస్తాం. ఆడిషన్స్‌ ద్వారా నటీనటులు యాక్టింగ్‌ స్కిల్స్‌ చూపించుకోవచ్చు’’ అన్నారు శ్రీనివాస్‌ శరకడం. ‘‘ఒక స్కామ్‌ ఆధారంగా ఈ సినిమా చేస్తున్నాం. షూటింగ్‌ చివరి దశలో ఉంది. వేసవిలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు విఘ్నేష్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు