హిట్ కొట్టినా చాన్స్ ఇవ్వడం లేదా..?

9 Apr, 2016 14:45 IST|Sakshi
హిట్ కొట్టినా చాన్స్ ఇవ్వడం లేదా..?
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్స్ లిస్ట్లో ముందుగా వినిపించే పేరు శృతిహాసన్. ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు లాంటి వరుస బ్లాక్ బస్టర్స్లో నటించిన ఈ బ్యూటి, ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తుంది. సాదారణంగా టాలీవుడ్లో ఒక్క హిట్ ఇచ్చినా.. ఆ హీరోయిన్ వెంటే పరిగెడుతుంటారు. అలాంటిది శృతిని మాత్రం పట్టించుకోవట్లేదు. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉందన్న టాక్ ఉన్నా, శృతికి మాత్రం అవకాశాలు రావటం లేదు.
 
ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ప్రేమమ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది శృతి. స్టార్ హీరోల సరసన భారీ బడ్జెట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటి, ప్రేమమ్ లాంటి మీడియం బడ్జెట్ సినిమాను అంగీకరించడం కూడా విశేషమే. ప్రేమమ్తో పాటు హిందీలో, తమిళ్లో ఒక్కో సినిమా చేస్తున్న శృతి, కావాలనే సినిమాలను తగ్గించుకుంటుందా..? లేక ఆఫర్లే రావటం లేదా..? అన్న విషయం తెలియలేదు.
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి