ప్రేమికుల రోజున...

23 Dec, 2018 03:36 IST|Sakshi
ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

కొంటె సైగతో దేశంలోని యూత్‌ అందర్నీ ఫిదా చేసిన ‘వింక్‌ సెన్సేషన్‌’ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్‌ లవ్‌’ టీజర్‌లో ఆమె కన్ను కొట్టే షాట్‌ ఎంత హల్‌చల్‌ చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రం ‘లవర్స్‌ డే’ అనే టైటిల్‌తో తెలుగులో రిలీజ్‌ కానుంది. సుఖీభవ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మాతలు ఎ.గురురాజ్, సి.హెచ్‌ వినోద్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఒరు ఆధార్‌ లవ్‌’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క కంటి సైగతో ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌ అంత గొప్పది. భారీ పోటీ మధ్య ఈ సినిమా హక్కులను మేం సొంతం చేసుకున్నాం. వేలెంటైన్స్‌ డే సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. రొమాంటిక్‌ కామెడీగా సాగే ఈ కథకు షాన్‌ రెహమాన్‌ సంగీతం హైలెట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శీను సిద్ధార్ధ్, కథ– దర్శకత్వం: ఒమర్‌ లులు.

మరిన్ని వార్తలు