ఆస్కార్‌ మారుతోంది!

14 Feb, 2019 02:52 IST|Sakshi

ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డ్స్‌కు సంబంధించిన ప్రతీ విషయం విచిత్రంగానో, వివాదంలానో మారుతోంది. యాంకర్‌ లేకుండానే వేడుకను నిర్వహిస్తాం అని ఇటీవల నిర్వాహకులు ప్రకటించారు. తాజాగా ‘సినిమాటోగ్రఫీ, ఫిల్మ్‌ ఎడిటింగ్, లైవ్‌యాక్షన్‌ షార్ట్, మేకప్, హెయిర్‌ స్టైల్‌’ విభాగాలకు సంబంధించిన అవార్డులను పక్కన పెడుతున్నట్టు అకాడమీ ప్రెసిడెంట్‌ జాన్‌ బెయిలీ ప్రకటించారు. పైన పేర్కొన్న అవార్డులను టీవీల్లో యాడ్స్‌ ప్లే అయ్యే సమయంలో ఇవ్వనున్నారట. ఈ నిర్ణయం గురించి గతేడాది బెస్ట్‌ డైరెక్టర్‌గా ఆస్కార్‌ అందుకున్న గులెర్మో డెల్‌ టొరో మాట్లాడుతూ – ‘‘ఏయే కేటగిరీలను తొలగించాలో నేను చెప్పలేను. కానీ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ అనేవి సినిమాకు ప్రాణం. గుండెలాంటివి. వాటిని చిన్నచూపు చూస్తూ.. ఇలా యాడ్స్‌ ప్లే అయ్యే టైమ్‌లో ఇవ్వాలనుకోవడం కరెక్ట్‌ కాదని భావిస్తున్నాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు