రాబర్ట్‌ ఫోర్‌స్టర్‌ మృతి

12 Oct, 2019 13:07 IST|Sakshi

లాస్‌ ఎంజెల్స్‌ ‌: ప్రముఖ హాలీవుడ్‌ నటుడు రాబర్ట్‌ ఫోర్‌స్టర్‌ శుక్రవారం బ్రెయిన్‌ క్యాన్సర్‌తో మృతి చెందారు. రాబర్ట్‌(78)  దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించారు. ఆయన మరణవార్త విన్న హాలీవుడ్ నటి, నటులు దిగ్ర్భాంతికి గురై ట్విటర్‌లో ఆయన ఫోటోలను పోస్ట్‌ చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా ఈయన నటించిన ‘ఈద్‌ ఇన్‌ ఈల్‌ కమీనో’  విడుదలై బాక్సాఫీస్‌ వద్ద బొల్తా కొట్టినప్పటీకి శుక్రవారం ఆయన మరణంతో మరోసారి అమెరికా స్క్రీన్‌ పైకి వచ్చింది. క్వెంటిన్‌ టరాన్టినో దర్శకత్వంలో వచ్చిన ‘జాకీ బ్రౌన్‌’ సినిమాలో ఆయన పోషించిన మాక్స్‌ చెర్రి పాత్రకుగాను ఇటీవలే ఆస్కార్‌ ఆవార్డుకు ఎన్నికయ్యారు. ఆయన మక్స్‌ చెర్రీ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించాడు. దర్శకుడు ఆయన కోసమే మాక్స్‌ చెర్రీ పాత్రను సృష్టించారా! అనేలా ఆ పాత్రలో రాబర్ట్‌  ఓదిగిపోయారు. కాగా స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ ‘అమేజింగ్‌ స్టోరిస్‌’, ‘వేర్‌వోల్ఫ్‌’ చిత్రాలలో కూడ రాబర్ట్‌ నటించి మెప్పించారు.

కాగా న్యూయార్క్‌లో జన్మించిన రాబర్ట్‌, బ్రాడ్‌వేలో ‘డాలీ హ్యాస్‌ ఏ లవర్‌’తో తన కెరీయర్‌ను ప్రారంభీంచారు. ప్రముఖ దర్శకుడు జాన్‌ హాస్టన్‌ 1976 లో తీసిన ‘రిప్లెక్షన్స్‌ ఇన్‌ ఎ గోల్డేన్‌ ఐ’ సినిమాతో హీరోగా హాలీవుడ్‌లో తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో రాబర్ట్‌ సరసన ఎలిజిబెత్‌ టేలర్ హీరోయిన్‌గా, ప్రముఖ స్టార్‌ మార్టన్‌ బ్రాండో ప్రతినాయకుడిగా చేశారు. హాస్కెల్‌ వెక్స్లర్‌ అల్టా రియాలిస్టీక్‌ మీడియం కూల్‌లో మంచి కెమరమాన్‌గా గుర్తింపు తెచ్చుకుని విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకున్నారు. అలాగే రాబర్ట్‌ పలు టీవీ సిరియల్‌లో టైటిల్‌ రోల్‌లో చేసి తనకుంటూ ఓ ప్రత్యేకమైన మార్క్‌ను తెచ్చుకున్నారు. 

>
మరిన్ని వార్తలు