ఆస్కార్‌ బరిలో  ఎవరెవరో తెలుసా?

24 Jan, 2018 00:40 IST|Sakshi

90వ ఆస్కార్‌ అవార్డ్స్‌ బరిలో పోటీపడే సినిమాలు, నటీనటులు, టెక్నీషి యన్లు ఎవరో మంగళవారం తెలిసిపోయింది. ఆస్కార్‌ అవార్డ్స్‌ అందించే అకాడమీ అవార్డ్స్‌ సంస్థ అధికారికంగా నామినేషన్స్‌ని ప్రకటించింది. ‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌’ 13 నామినేషన్లు దక్కించుకోగా, ‘డంకర్క్‌’ ఎనిమిది విభాగాల్లో, ‘త్రీ బిల్‌బోర్డ్స్‌ అవుట్‌సైడ్‌ ఎబ్బింగ్, మిస్సోరి’  ఏడు విభాగాల్లోనూ నామినేషన్‌ దక్కించుకున్నాయి. ఈసారి ‘సినిమాటోగ్రఫీ’ విభాగంలో ఛాయాగ్రాహకురాలు రేచెల్‌ మారిసన్‌కి నామినేషన్‌ దక్కడం విశేషం. ఈ విభాగంలో నామినేషన్‌ దక్కించుకున్న తొలి మహిళ ఆవిడే. ఇక.. నామినేషన్‌ జాబితా చూద్దాం.

ఉత్తమ చిత్రం
కాల్‌ మీ బై యువర్‌ నేమ్, డార్కస్ట్‌ అవర్, డంకర్క్, గెట్‌ అవుట్, లేడీ బర్డ్, ఫాంథమ్‌ థ్రెడ్, ది పోస్ట్, ది షేప్‌ ఆఫ్‌ వాటర్, త్రీ బిల్‌బోర్డ్స్‌ అవుట్‌సైడ్‌ ఎబ్బింగ్, మిస్సోరి. ఉత్తమ చిత్రం విభాగంలో ఈ తొమ్మిదీ నామినేషన్‌ దక్కించుకున్నాయి.

ఉత్తమ నటుడు
టిమోథ్‌ చలామెట్‌ (కాల్‌ మీ బై యువర్‌ నేమ్‌), డానియెల్‌ డూ–లెవిస్‌ (ఫాంథమ్‌ థ్రెడ్‌), డానియెల్‌ కలూయా, (గెట్‌ అవుట్,) గ్యారీ ఓల్డ్‌మేన్‌ (డార్కస్ట్‌ అవర్‌), డెంజెల్‌ వాషింగ్టన్, (రోమన్‌ జో ఇజ్రాయెల్‌ ఎస్క్యూ).

ఉత్తమ నటి
సాలీ హాకిన్స్‌ (ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌), ఫ్రాన్సెస్‌ మెక్‌ డోర్‌మాండ్, (త్రీ బిల్‌బోర్డ్స్‌ అవుట్‌సైడ్‌ ఎబ్బింగ్, మిస్సోరి), మార్కెట్‌ రాబీ (ఐ, టోన్యా), సాయోర్స్‌ రోనన్‌ (లేడీ బర్డ్‌), మెరిల్‌ స్ట్రీప్‌ (ది పోస్ట్‌).

ఉత్తమ దర్శకుడు
పాల్‌ థామస్‌ అండర్‌సన్‌ (ఫాంథమ్‌ థ్రెడ్‌), గిలియర్మొ దెల్‌తొరొ (ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌), గ్రెటా గెర్‌విగ్‌ (లేడీ బర్డ్‌), క్రిస్టోఫర్‌ నోలన్‌ (డంకర్క్‌), జోర్డాన్‌ పీలే (గెట్‌ అవుట్‌).
ఇంకా ఇతర విభాగాల్లో నామినేషన్స్‌ను ప్రకటించారు. మార్చి 4న ఆస్కార్‌ అవార్డు వేడుక జరగనుంది. మరి.. అవార్డులు అందుకునేదెవరో వేచి చూద్దాం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు